రీపోలింగ్ పై నిర్ణయం వారిదే..!

కొన్ని చోట్ల ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఇక్కడ రిపోలింగ్ నిర్వహించాలా లేదా అనేది రేపు [more]

Update: 2019-04-11 13:56 GMT

కొన్ని చోట్ల ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఇక్కడ రిపోలింగ్ నిర్వహించాలా లేదా అనేది రేపు నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో ఒక హత్య కూడా జరిగిందని, దీని ద్వారా పోలింగ్ కొంత నెమ్మదించిందని, కానీ పోలింగ్ ఆగిపోలేదన్నారు. వివిధ ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని పలు రాజకీయ పార్టీల నుంచి వినతులు వచ్చాయని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని, వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈవీఎంల ధ్వంసంపై ఏడు చోట్ల కేసులు నమోదయ్యాయన్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి విధ్వంస సంఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 65.96 శాతం పోలింగ్ నమోదైందని, పూర్తి పోలింగ్ శాతంపై మరికొంత సేపటికి స్పష్టత వస్తుందన్నారు.

Tags:    

Similar News