బంగారం…భద్రమేనట…!!

టీటీడీ కి చెందిన 1381 కేజీల బంగారం తరలింపు వివాదం పై సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. 23 వ తేదీలోగా విచారణ నివేదిక ఇవ్వాలని [more]

Update: 2019-04-22 07:46 GMT

టీటీడీ కి చెందిన 1381 కేజీల బంగారం తరలింపు వివాదం పై సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. 23 వ తేదీలోగా విచారణ నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ని విచారణాధికారిగా నియమించిన సీఎస్ ఎల్వి సుబ్రమణ్యం తక్షణమే తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని సూచించారు. తిరుమల తిరుపతి కి చెందిన బంగారం రవాణాలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని ఆదేశించారు. టీటీడీ, విజిలెన్స్ అధికారుల వ్యవహరించిన తీరుపై నివేదిక ఇవ్వాలన్నారు. అయితే చీఫ్ సెక్రటరీ వ్యాఖ్యలను టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఖండించారు. టీటీడీకిచెందిన బంగారం మొత్తం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భద్రంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో టీటీడీ బంగారం తరలింపు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.

Tags:    

Similar News