ఆ….ప్రచారాన్ని ఖండించిన సీఈఓ

రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలకు [more]

Update: 2019-04-11 06:45 GMT

రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలకు పైగా పోలింగ్ బూత్ లలో 92 వేలకు పైగా ఈవీఎంలు ఉన్నాయని, 30 శాతం అంటే 27 వేల ఈవీఎంలు పనిచేయడం లేదనేది చాలా తప్పుడు ప్రచారమన్నారు. వారన్నట్లుగా పనిచేయని 27 వేల ఈవీఎంల లిస్ట్ బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. తాను అన్ని వివరాలూ తీసుకున్నానని, కేవలం 344 ఈవీఎంలు మాత్రమే పనిచేయలేదని, వాటిని కూడా సరిచేసి పోలింగ్ సజావుగా జరుపుతున్నామని స్పష్టం చేశారు. ఈవీఎంలపై మీడియా ఛానళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ప్రజలంతా పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ సమయం పెంచాల్సిన అవసరం లేదని ఆన్నారు. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ బూత్ లో ఉన్న వారికి ఓటింగ్ కి అవకాశం కల్పిస్తామన్నారు.

Tags:    

Similar News