గిడ్డి ఈశ్వరి టెన్షన్ పెట్టారే

Update: 2018-04-13 03:43 GMT

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పోలీసులను టెన్షన్ పెట్టారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో పర్యటన వద్దని చెబుతున్నా గిడ్డి ఈశ్వరి విన్పించుకోకుండా వెళ్లారు. అయితే ఎనిమిది గంటల పాటు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆచూకీ తెలియక పోలీసుల హైరానా పడ్డారు. చివరకు రాత్రి పది గంటల సమయంలో ఎమ్మెల్యే ఫోన్ కలవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గిడ్డి ఈశ్వరి ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ పిలుపునిచ్చిన దళితతేజం కార్యక్రమంలో పాల్గొనేందుకు గిడ్డి ఈశ్వరి గూడెం కొత్త వీధి మండంలం ఆర్వీ నగర్లో పర్యటించారు. అక్కడి నుంచి మారుమూల ప్రాంతమైన ధారవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు వద్దని వారించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో పర్యటనను మానుకోవాలని పోలీసులు సూచించినా గిడ్డి ఈశ్వరి బయలుదేరి వెళ్లారు. అయితే దాదాపు ఎనిమిది గంటల పాటు గిడ్డి ఈశ్వరి జాడ తెలియకపోవడంతో పోలీసులు ఉత్కంఠకు గురయ్యారు. ఆమె ధారకొండకు చేరుకున్నారన్న సమాచారం ఎనిమిది గంటల తర్వాత తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News