ఈ మంత్రిగారికి జరిమానా వేయరా? మాస్క్ ఏది మాస్టారూ?

కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేయడం కోసం ప్రజల కోసం ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు నిబంధనలు తీసుకొస్తు న్నాయి. కరోనా [more]

Update: 2020-05-21 12:57 GMT

కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేయడం కోసం ప్రజల కోసం ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు నిబంధనలు తీసుకొస్తు న్నాయి. కరోనా విజృంభిస్తున్న ఇటువంటి సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఎవరైనా సరే ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలని లేకపోతే ముక్కుపిండి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా బైక్ నడిపితే హెల్మెట్, కారు నడిపితే సీట్ బెల్ట్ ఈ నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాల్సిందే లేకపోతే పోలీసులు నేరుగా జరిమానాలు విధించి ఇంటికి పంపిస్తున్నారు. ఇలా కరోనా కట్టడి నియంత్రణలో నియమ నిబంధనలు విధించి నప్పటికీ కూడా కొందరు రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారు. అది కేవలం సామాన్యుల కోసమే అని తమకు మాత్రం కాదని మంత్రి గంగుల కమలాకర్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు ప్రయాణం చేశాడు. అంతేకాకుండా మాస్కు కూడా ధరించకుండా బయట తిరుగుతున్నారు. మాస్క్ లేకుండా సీట్ బెల్ట్ కూడా లేకుండా ఆయన కారు ప్రాణం చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రిగారు ఈ నియమ నిబంధనలు అన్నీ సామాన్యులకేనా మీకు వర్తించవా? అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా మంత్రి గంగుల కమలాకర్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా పక్కన మరో మంత్రి కూర్చున్నారు ఆయన మాత్రం మాస్కు ధరించి ఉన్నారు.

Tags:    

Similar News