వేలిముద్రల మాయగాడు ఏం చెప్పాడో....?

Update: 2018-06-29 13:59 GMT

వేలిముద్రల స్కాం నిందితుడు సంతోష్ ను ఎస్ ఆర్ నగర్ పోలిసులు పెద్దపల్లి జిల్లా ధర్మాపురం తీసుకువెళ్లారు. ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ లో పోలీసుల సోదాలు కొనసాగిస్తున్నారు. రబ్బర్‌ స్టాంపుల తయారీ యంత్రంతో పాటు అతడి సెల్‌ఫోన్, డౌన్‌లోడ్‌ చేసిన 1,400 డాక్యుమెంట్లు, నకిలీ వేలిముద్రల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా వేలిముద్రల స్కాంలో బాగంగా సంతోష్ కుమార్ ను ఎస్ ఆర్ నగర్ పోలిసులు రెండు రోజుల కస్టడిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో తొలిరోజు విచారణ పూర్తి చేసిన పోలిసులు రెండో రోజు పెద్దపల్లి ధర్మాపురం తీసుకెళ్లారు.

ధర్మాపురంలో విచారణ.....

ధర్మాపురంలో వేలిముద్రల స్కాం నిందితున్ని విచారించిన తరువాత తిరిగి హైదరాబాద్ తీసుకురానున్నారు. ఈ రోజుతో సంతోష్ కుమర్ కస్డడి ముగియనున్ననేపథ్యంలో పోలిసులు దూకుడు పెంచారు. వివిద కోణాల్లో సంతోష్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. సిమ్‌కార్డుల అమ్మకాల్లో టార్గెట్‌ను చేరుకోవడానికి నకిలీ వేలిముద్రలు తయారు చేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్‌ వొడాఫోన్‌ ప్రీ – పెయిడ్‌ కనెక్షన్స్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి సేకరించిన వేలిముద్రలకు నకిలీ వేలిముద్రలు తయారు చేసిన సంతోష్‌కుమార్‌ దాదాపు నాలుగు వేల సిమ్‌కార్డులు ఆక్టివేషన్‌ చేసినట్లు సమాచారం.

టార్గెట్ రీచ్ అయ్యేందుకేనా?

అయితే, ప్రాథమిక విచారణలో సిమ్‌కార్డుల విక్రయానికి సంబంధించిన టార్గెట్‌ను పూర్తిచేయడానికే నకిలీ వేలిముద్రలు తయారు చేసినట్టు వెల్లడించాడు. నకిలి వేలిముద్ర కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ధర్మాపురంలో రేషన్ డీలర్ల సహకారంతో వారితో ఓప్పందం పెట్టుకొని నకిలి వేలిముద్రలు సేకరించినట్లు విచారణలో పోలిసులు కనుగొన్నారు. నలుగురు రేషన్ డీలర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన వేలిముద్రలు రేషన్ డీలర్లతో ఒప్పందం పెట్టుకొని బియ్మం అక్రమ రవాణా చేసినట్లు గుర్తించారు.

సంఘ విద్రోహ శక్తులకు విక్రయించాడా?

వేలిముద్రలు సంఘవిద్రోహ శక్తులకు అతను సిమ్‌కార్డులు అందించాడా? ఈనకిలీ వేలిముద్రల తయారీ వెనుక ఇంకెవరెవరు సహకరించారు అన్న కొణంలో పోలిసులు విచారణ కొనసాగిస్తున్నారు. వేలిముద్రల స్కాం నిందితుడు సంతోష్‌ కుమార్ ఇంతపెద్ద నేరం చేశాడా అని పెద్దపల్లి జిల్లా ధర్మపురి వాసులు చర్చించుకుంటున్నారు. ధర్మపురిలోని సంతోష్ నివాసంలో పోలీసులు సోదాలు కొనసాగించారు. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించిన నేపద్యంలో కేంద్రం సైతం కళ్లు తెరించింది. సిమ్‌కార్డుల టార్గెట్‌ చేరుకునేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల నివ్వెరపోతున్నారు. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో సంతోష్‌ వివాదాస్పదంగా వ్యవహరించేవాడని ధర్మపురి వాసులు అంటున్నారు.

ఆధార్ భద్రతకు సవాల్.....

వేల సంఖ్యలో నకిలీ వేలిముద్రల స్కాం బయటపడడంతో ఆధార్‌ బయోమెట్రిక్‌ భద్రతకు సవాల్‌గా నిలిచింది. ఆధార్‌ బయోమెట్రిక్‌ వ్యవస్థలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దేందుకు యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు. సంతోష్ కమార్ రెండు రోజుల కస్టడి నేటితో ముగియనున్న నేపద్యంలో విచారణలో ఏలాంటి విషయాలు వెల్లడించాడు. వాటి అంశాలపై కేంద్రం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి మరి.. లేదంటే ఆధార్ బయోమెట్రిక్ పైన ప్రజలు అభద్రతాభావంలో ఉండే అవకాశం ఉంది.

Similar News