అది తప్పుడు ప్రచారమేనటగా..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ ఈవీఎంల పనితీరుపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈవీఎంలు పనిచేయడం లేదని ఓ పార్టీకి అనుకూలంగా ఉండే [more]

Update: 2019-04-11 05:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ ఈవీఎంల పనితీరుపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈవీఎంలు పనిచేయడం లేదని ఓ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగా ఆ పార్టీ పెద్దలు సైతం ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు. పైగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయని, తమకు అనుకూలంగా ఉన్న బూత్ లలోనే ఈవీఎంలు పనిచేయడం లేదనే వాదనకు దిగారు. అయితే, ఈ వాదనను ఎన్నికల సంఘం కొట్టి పారేసింది. రాష్ట్రవ్యాప్తంగా చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు.

కేవలం 362 ఈవీఎంలలో సమస్య

మొత్తం 45,900 ఈవీఎంలలో కేవలం 362 ఈవీఎంలలో మాత్రమే సమస్య వచ్చిందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 600 మంది ఇంజనీర్లు ఉన్నారని, ఈవీఎంలను తిరిగి పునరుద్ధరించారని స్పష్టం చేశారు. పైగా గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. అయితే, ఈవీఎంలు పనిచేయడం లేదనే తప్పుడు ప్రచారం ద్వారా పోలింగ్ శాతం తక్కువ జరిగేలా తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని, అందుకే ఆ పార్టీ అనుకూల ఛానళ్లలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నారు.

Tags:    

Similar News