రమేష్ ఆసుపత్రిదీ బాధ్యతే… తేల్చి చెప్పిన కమిటీ

రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని కమిటీ రిపోర్ట్ లో పేర్కొంది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ [more]

Update: 2020-08-16 06:28 GMT

రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని కమిటీ రిపోర్ట్ లో పేర్కొంది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణమని కమిటీ తేల్చింది. కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన రమేష్ ఆసుపత్రి కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. స్వర్ణా ప్యాలెస్ లో లోపాలున్నప్పటికీ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం తప్పు అని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తీరును తెలిపింది. నాలుగు పేజీల నివేదికను కమిటీ అందించింది. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆసుపత్రి మధ్య అంగీకార ఒప్పందని తెలిపింది. విద్యత్తు లోపాలను సరిచేయకపోడం వల్లనే ప్రమాదం సంభవించిందని పేర్కొంది. విద్యుత్తు లోపాలు సరిచేయకుండానే కోవిడ్ ఆసుపత్రిని నిర్వహించడాన్ని తప్పుపట్టింది. నిందితులు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కమిటీ తన నివేదికలో తెలిపింది.

Tags:    

Similar News