బ్లాక్ మార్కెట్ లోకి రెమిడెసివిర్.. తొమ్మిది మంది అరెస్ట్

కరోనా నుంచి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అత్యవసర మందు రెమిడిసివిర్ కోసం ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు. దీనిని అక్రమార్కులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆసుపత్రి నుంచి [more]

Update: 2021-05-02 01:02 GMT

కరోనా నుంచి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అత్యవసర మందు రెమిడిసివిర్ కోసం ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు. దీనిని అక్రమార్కులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆసుపత్రి నుంచి ఈ రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లి పోతుంది . ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది చేతివాటం తో ఈ మందు బ్లాక్ మార్కెట్ లో లో కి వెళ్లి పోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా రెమిడిసివేర్ అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది . పూర్తి నిఘా పెట్టి అక్రమంగా అమ్ముతుంటే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరులో డెకాయ్ ఆపరేషన్ ద్వారా బ్లాక్ మార్కెట్ ముఠా ఆటకట్టించామని అడిషన్ ఎస్పీ మూర్తి తెలిపారు. నరసరావుపేటలో ముగ్గురిని అరెస్ట్ చేసి ఎనిమిది ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తెనాలిలో ఆరుగురిని పట్టుకున్నామని చెప్పారు.

Tags:    

Similar News