షిండే గేమ్ ప్లాన్.. నిఘాకు అందకుండా... ఎమ్మెల్యేలు నమ్మిందిలా?

శివసేన హిందుత్వానికి దూరమయ్యేంత వరకూ షిండే వెయిట్ చేశారు. శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగులుకునేంత వరకూ వేచి చూశారు.

Update: 2022-06-23 05:35 GMT

శివసేన ఎమ్మెల్యేలను చీల్చడం అంత సులువు కాదు. ఎందుకంటే దానిని ప్రాంతీయ పార్టీగా పరిగణించలేం. అదే సమయంలో కుటుంబ పార్టీగా కూడా చూడలేం. ఎందుకంటే అది హిందుత్వంతో దూసుకుపోయిన పార్టీ. అధికారం ఆశించకుండా దశాబ్దాల పాటు హిందువుల కోసం పోరాటం చేసిన పార్టీ. దానిని రాజకీయ పార్టీగా మొన్నటి వరకూ చూడలేం. దానికి రాజకీయాల కన్నా హిందుత్వమే ముఖ్యం.

హిందుత్వ పార్టీ గానే...
బాల్ థాక్రే ఉన్నప్పటి నుంచి శివసేన హిందుత్వ పార్టీగానే ఎదిగింది. హిందువులకు అండగా నిలబడుతూ మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. ఆయన మరణం తర్వాత ఉద్ధవ్ థాక్రే శివసేన పగ్గాలు అందుకున్నారు. అయినా ప్రజలు దానిని ఎవరూ వ్యతిరేకించరు. కుటుంబ పార్టీగా అస్సలు పరిగణించరు. కానీ ఉద్ధవ్ పగ్గాలు చేపట్టిన తర్వాత కుటుంబ పార్టీగా చూడాల్సి వస్తుంది. హిందుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్, ఎన్సీపీ ఎదుట మోకరిల్లింది. దీంతో ప్రజల్లో శివసేన పై ఒకరమైన వ్యతిరేక భావం ఏర్పడింది. దానిని ఏక్ నాథ్ షిండ్ే తనకు అనుకూలంగా మార్చుకున్నారు. గేమ్ ప్లాన్ ను రచించారు.
కార్పొరేటర్ స్థాయి నుంచి...
ఏక్‌నాథ్ షిండే వయసు 59 ఏళ్లు. డిగ్రీ పూర్తి చేసిన షిండే 1980లో శివసేనలో చేరాడు. థానే మున్సిపాలిటీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు. తర్వాత 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా, మంత్రిగా కూడా పనిచేవారు. బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో శాసనసభ పక్ష నేతగా కూడా షిండే వ్యవహరించారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఎంపీగా ఉన్నారు. సోదరుడు ప్రకాష్ షిండే కార్పొరేటర్ గా ఉన్నారు. పార్టీ గెలుపుకోసం, విస్తరణ కోసం సర్వశక్తులు షిండే కొన్ని దశాబ్దాలుగా శ్రమించారన్న దానిలో సందేహం లేదు. బాలా సాహెబ్, బాబా సాహెబ్ అన్న నినాదంతో పార్టీని మహారాష్ట్ర అంతగా విస్తరించడంలో షిండే కృషిని కాదనలేం.
ఇంటలిజెన్స్ వ్యవస్థకు అందకుండా....
బాలథాక్రే ఉన్నప్పుడు మాతృశ్రీకి నేరుగా వెళ్లగలిగే ఏకైక నేత ఏక్‌నాథ్ షిండేకు ఉంది. ఆయనను పెద్దాయన అంతగా అభిమానించేవారు. ఉద్ధవ్ థాక్రే కూడా అధికారంలోకి రాకమునుపు వరకూ షిండేకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ రాను రాను ప్రయారిటీ తగ్గింది. శివసేన హిందుత్వానికి దూరమయ్యేంత వరకూ షిండే వెయిట్ చేశారు. శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగులుకునేంత వరకూ వేచి చూశారు. 37 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేంత వరకూ సహనం పాటించారు. ఇంటలిజెన్స్ వ్యవస్థకు కూడా అందకుండా షిండే ప్లాన్ చేశారు. షిండే సమర్థ నాయకత్వ పటిమను తెలిసిన ఎమ్మెల్యేలు ఆయనను నమ్మి వెనక వచ్చారు. దీంతో షిండే గేమ్ ప్లాన్ సక్సెస్ అయింది. ప్రభుత్వ పతనానికి కారణమయింది.



Tags:    

Similar News