ఏపీలో ఈడీ దాడులు… అటాచ్ మెంట్ దిశగా

ప్రజల నుంచి నిధులను సేకరించి ఎగ్గొట్టిన అగ్రిగోల్డ్ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈమేరకు ఇవాళ ఉదయం నుంచి అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర [more]

Update: 2020-03-04 06:52 GMT

ప్రజల నుంచి నిధులను సేకరించి ఎగ్గొట్టిన అగ్రిగోల్డ్ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈమేరకు ఇవాళ ఉదయం నుంచి అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర సంస్థల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలను ప్రారంభించింది. ఇవాళ ఉదయం నుంచి మొత్తం 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఆరువేల కోట్ల రూపాయల మేరకు అగ్రిగోల్డ్ డిపాజిట్ల రూపంలో సేకరించింది. సేకరించిన నిధులను తిరిగి ప్రజలకు చెల్లించకపోవడంతో ఏపీ సిఐడి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఇప్పటికే చాలావరకు ఆస్తులను కూడా అటాచ్ చేసింది. అయితే ఈ స్కామ్ లో మనీలాండరింగ్ తోపాటు హవాలా తో పాటుగా పెద్ద ఎత్తున విదేశాలకు నిధులు మళ్ళించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీ సిఐడి నుంచి సమాచారాన్ని ఈడీ సేకరించింది. ఏపీ సిఐడి ఇచ్చిన సమాచారంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ కంపెనీలతో పాటు సంస్థ ప్రతినిధులు ఇళ్ళల్లో ఉదయం నుంచి సోదాలు చేస్తుంది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ డైరెక్టర్ పెద్ద మొత్తంలో ప్రజల నిధులతో ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలున్నాయి. అదే మాదిరిగా పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా హవాలా ద్వారా నిధులను ఇతర దేశాలకు పంపించినట్టు గా ఆధారాలు సేకరించారు. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Tags:    

Similar News