జీవీకే మెడ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

జీవీకే మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. జీవీకే తో పాటుగా అతని కుమారుడైన ఈడీ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్ పోర్ట్ అథారిటీ నిధుల గోల్మాల్ పైన [more]

Update: 2020-07-07 14:45 GMT

జీవీకే మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. జీవీకే తో పాటుగా అతని కుమారుడైన ఈడీ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్ పోర్ట్ అథారిటీ నిధుల గోల్మాల్ పైన ఇప్పటికే సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కొత్తగా జీవీకే కేసు నమోదు చేసింది. జీవీకే తో పాటుగా మొత్తం తొమ్మిది కంపెనీల పైన కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ముంబై ఎయిర్ పోర్టు అథారిటీ నిధులను పక్కదారి పట్టించారన్న సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ కూడా చేస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే సిబిఐ గుర్తించింది. అయితే 9 కంపెనీల ద్వారా జీవీకే నిధులు మళ్లించినట్లుగా అధికారులు తేర్చారు. నవి ముంబై పక్కనే 200 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో జీవీకే అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. 395 కోట్ల రూపాయలను తన సొంత సంస్థలకు బదిలీ చేసినట్టుగా సిబిఐ ఆరోపించింది. దీంతోపాటుగా పింకీ రెడ్డికి సంబంధించిన ట్రాన్స్ పోర్ట్ కంపెనీకి కూడా పెద్ద మొత్తంలో నిధులు మళ్లించినట్లుగా తేల్చారు. అయితే సీబీఐ కేసు ఆధారంగా ఈడి కేసు పెట్టి విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News