కలెక్టర్లపై ఎన్నికల సంఘం సీరియస్

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు జరిగిన సంఘటనలకు కారణాలను విశ్లేషించే పనిలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వహించారని ఎన్నికల సంఘం [more]

Update: 2019-04-17 10:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు జరిగిన సంఘటనలకు కారణాలను విశ్లేషించే పనిలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వహించారని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రతీ నియోజకవర్గానికి ముగ్గురు బీహెచ్ఈఎల్ ఇంజనీర్లను కేటాయించినా వారిని ఈవీఎంలు మొరాయించిన చోట్ల ఉపయోగించుకోకపోవడంతో ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. కొన్ని జిల్లాల్లో కనీసం వారికి రూట్ మ్యాప్లు కూడా ఇవ్వలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ అంశాలపై 13 జిల్లాల కలెక్టర్లకు సీఈఓ జీకే ద్వివేది నోటీసులు ఇచ్చారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎన్నికలు ఎందుకు జరపాల్సి వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఉద్దేశపూర్వంగా తప్పులు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ద్వివేది తెలిపారు.

Tags:    

Similar News