బ్రేకింగ్: ఈబీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి షాక్

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీసీ సంక్షేమ [more]

Update: 2019-02-11 07:21 GMT

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వేసిన పిటీషన్ ను ఇవాళ సుప్రీం కోర్టు విచారించింది. ఈ అంశంపై ఈ నెల 26వ తేదీలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ఉభయ సభల్లో బిల్లు పెట్టి చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

Tags:    

Similar News