Duvvada : కలకలం రేపుతున్న దువ్వాడ వీడియో

ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వైసీపీలో విభేదాలు తీవ్రమయ్యాయి. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అగ్ర నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన [more]

Update: 2021-09-24 04:04 GMT

ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వైసీపీలో విభేదాలు తీవ్రమయ్యాయి. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అగ్ర నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతుంది. వైసీపీ ఎంపీటీసీలను క్యాంప్ నకు తరలించిన పేరాడ తిలక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని దువ్వాడ శ్రీనివాస్ వీడియోలో హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో 16 మంది ఎంపీటీసీలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే పేరాడ తిలక్ 11 మంది ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ అగ్రనేత విజయసాయిరెడ్డికి వివరించానని ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News