కోడెల శివరాంకు పోలీసులు నోటీసులు

కోడెల శివప్రసాద్ తొలి వర్ధంతి సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కోడెల శివరాంకు నోటీసులు ఇచ్చారు. రేపు [more]

Update: 2020-09-15 12:43 GMT

కోడెల శివప్రసాద్ తొలి వర్ధంతి సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కోడెల శివరాంకు నోటీసులు ఇచ్చారు. రేపు కోడెల శివప్రసాద్ తొలి వర్ధంతి. అయితే అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్న పార్టీ నేతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. కోవిడ్ నిబంధలను ఉల్లఘించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కేసుల పెడతామని హెచ్చరించారు. దీంతో గుంటూరు జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News