నిన్ను నమ్మేది లేదు బాబూ..?

ఆసుపత్రులు నోటీసులు ఇచ్చి మరీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే ఏమీ చేయలేని చంద్రబాబుది సమర్థవంతమైన పరిపాలన ఎలా అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు [more]

Update: 2019-01-03 07:26 GMT

ఆసుపత్రులు నోటీసులు ఇచ్చి మరీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే ఏమీ చేయలేని చంద్రబాబుది సమర్థవంతమైన పరిపాలన ఎలా అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. నాలుగేళ్లుగా కేంద్రం మనకు అన్యాయం చేస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నా బీజేపీ విసిరే బిస్కెట్లకు, స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నిలదీయలేదని ఆరోపించారు. నాలుగేళ్లుగా మన రాష్ట్రానికే ఎక్కువ నిధులు వచ్చాయని, కేంద్రం అన్నీ చేస్తుందని ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు నాలుగు నెలలు ఉన్నాయనగా తన వైఫల్యాలను బీజేపీపై నెట్టేసి ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.

ప్రజలే సిగ్గుపడుతున్నారు

రాష్ట్రాన్ని, ప్రజలను మోసగించడమే చంద్రబాబుకి ఉన్న అనుమానమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1 వెయ్యి ఖర్చవుతుంటే… ఏపీలో రూ.3 వేలు ఖర్చు అవ్వడం చేస్తుంటే… తమ ముఖ్యమంత్రి ఇంత అవినీతిపరుడా అని ప్రజలు సిగ్గు పడుతున్నారని అన్నారు. వేలాది కోట్లు అనేక విధాలుగా దుబారా చేసి రాష్ట్రాన్ని 2.20 లక్షల కోట్ల అప్పుల్లోకి నెత్తేశారని ఆరోపించారు. ప్రభుత్వం అంతా సక్రమంగా పనిచేస్తుంటే ఇప్పటికి 2 వేల జీఓలు ఎందుకు దాచిపెట్టారని, ప్రజల సొమ్ము ఎలా ఖర్చుపెడుతున్నారో చెప్పే ధైర్యం కూడా లేదా అని ప్రశ్నించారు. జీవో లు దాచిపెట్టాల్సిన అవసరం ఏముందన్నారు.

Tags:    

Similar News