నివురు గప్పిన నిప్పులా ఢిల్లీ

ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ట్రంప్ పర్యటన [more]

Update: 2020-02-26 03:37 GMT

ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో పెద్దయెత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అల్లర్లను అణిచివేసేందుకు పెద్దయెత్తున పోలీసు బలగాలను దింపినా ఫలితం లేకపోవడంతో కర్ఫ్యూ విధించారు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పరీక్షలను రద్దు చేశారు. ఢిల్లీ అల్లర్లపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం కానుంది. కేంద్ర కేబినెట్ కూడా మరికొద్ది సేపట్లో సమావేశం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ గా శ్రీవాత్సవను నియమించారు.

Tags:    

Similar News