కరోనాతో చనిపోయాడని డాక్టర్లపై దాడి

గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంటు మృతి చెందడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమాత్ లో ప్రార్థన కోసం వెళ్లి తిరిగి వచ్చిన కరీముద్దీన్ రెండు రోజుల క్రితం [more]

Update: 2020-04-02 01:39 GMT

గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంటు మృతి చెందడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమాత్ లో ప్రార్థన కోసం వెళ్లి తిరిగి వచ్చిన కరీముద్దీన్ రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. కరీముద్దీన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. గాంధీ హాస్పిటల్ లోని 8వ అంతస్తులో పెట్టి అధికారులు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం కరీముద్దీన్ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన కరీముద్దీన్ సోదరుడు డాక్టర్ల పైన దాడి చేశాడు. అక్కడున్న డాక్టర్లు, వార్డ్ నర్సులు సిబ్బంది పైన కరీముద్దీన్ సోదరుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆసుపత్రికి సంబంధించిన ఫర్నిచర్ అద్దాలను కూడా ధ్వంసం చేశాడు. అయితే కరీముద్దీన్ సోదరుడి కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అదే వార్డు లో కరీముద్దీన్ సోదరుడు కూడా చికిత్స పొందుతున్నాడు. సోదరుడు చనిపోవడాని జీర్ణించుకోలేక కరీముద్దీన్ సోదరుడు ఒక్కసారిగా ఆగ్రహంతో డాక్టర్లు, సిబ్బంది పైన దాడికి తెగబడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు డాక్టర్లు సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంగంలో దిగారు. నేరుగా గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు చక్కబెట్టి డాక్టర్లు, వైద్య సిబ్బంది పై దాడి చేసిన కరీముద్దీన్ సోదరుడి ని వెంటనే అరెస్టు చేశారు. ఇతని చెస్ట్ హాస్పిటల్ ఐసొ లేషన్ వార్డు కు తరలించారు. డాక్టర్లపై దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

Tags:    

Similar News