డేటా చోరీ కేసు.. మూడు సర్వర్లతో అశోక్ పరారీ..!

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును చేధించడానికి బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన నలుగురు ఎథికల్ [more]

Update: 2019-03-06 09:03 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును చేధించడానికి బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన నలుగురు ఎథికల్ హ్యాకర్ల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. అయితే, ఐటీ గ్రిడ్ లో కీలకమైన మూడు సర్వర్లు మాయమయ్యాయని ఎథికల్ హ్యాకర్లు గుర్తించారు. గత నెల 27వ తేదీ నుంచి ఇవి మాయమయ్యాయని, అదే రోజు నుంచి సంస్థ ఎండీ అశోక్ దాకవరపు పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఏడు కంప్యూటర్లలో డేటా కూడా మిస్ అయ్యింది. మాయమైన సర్వర్లను గాలించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు కావాలని సైబరాబాద్ పోలీసులు ఏపీ ఎన్నికల సంఘం, ఐటీ శాఖకు లేఖ రాశారు. ఇక, ఐటీ గ్రిడ్ సంస్థ దాచిన డేటా వివరాల కోసం అమెజాన్, గూగుల్ కంపెనీలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ సాయంత్రానికి ఈ వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమాచారం వచ్చాక ఐటీ గ్రిడ్ లో జరిగిన అక్రమాలు పూర్తిగా వెలుగులోకి రావచ్చు.

Tags:    

Similar News