టిక్కెట్ నాదే...దానంకి అప్పుడే మొదలైన పోరు

Update: 2018-06-23 12:41 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఇక లాంఛనమే. రేపు లేదా ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం ఆయన భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన బలప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ లో చేరకముందే ఆయనకు ఆ పార్టీలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఖైరతాబాద్ నాదే అంటున్న.....

ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఈ సారి టీఆర్ఎస్ నుంచి ఆ స్థానాన్ని దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పి.జనార్ధన్ రెడ్డి కూతురు విజయారెడ్డి ఆశిస్తున్నారు. దీంతో పాటు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా లైన్ లో ఉన్నారు. అయితే, దానం చేరికపై విజయారెడ్డి స్పందిస్తూ...తాను రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దానం నాగేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆయనే నిర్ణయించుకోవాలన్నారు. దీంతో దానం చేరికకు ముందే టీఆర్ఎస్ లో పోరు మొదలైనట్లుగా కనపడుతోంది.

Similar News