కేసీఆర్ తో డీఎస్ భేటీ

Update: 2018-08-09 08:38 GMT

సీనియర్ నేత డి.శ్రీనివాస్ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ టూర్ కు వెళ్లిన కేసీఆర్ తో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో డీఎస్ కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. నెల గడుస్తున్నా కేసీఆర్ డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ తో డీఎస్ భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించనట్లు తెలుస్తోంది. డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ పై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో డీఎస్ ను కేసీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలలో మిగిలిన టీఆర్ఎస్ సభ్యులతో కలసి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు. కాగా తనపై వస్తున్న ఆరోపణలపై డీఎస్ కేసీఆర్ కు వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.

Similar News