అవును..! చంద్రబాబుతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు

తనతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారని కాకినాడలో బీజేపీ మహిళా కార్పొరేటర్ ను బెదిరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని వైసీపీ నేతలు ఖండించారు. ఈ విషయమే వైసీపీ [more]

Update: 2019-01-05 08:32 GMT

తనతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారని కాకినాడలో బీజేపీ మహిళా కార్పొరేటర్ ను బెదిరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని వైసీపీ నేతలు ఖండించారు. ఈ విషయమే వైసీపీ నాయకులు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ… చంద్రబాబుతో పెట్టుకుంటే ఫినిష్ అవడం వాస్తవమేనని, చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు ఫినిష్ అయ్యారని, ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా అక్కడ ఫినిష్ అయిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు పతనానికి కౌంట్ డౌన్ మొదలైందని పేర్కొన్నారు. ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, అనేక దేశాలు తిరిగిన చంద్రబాబు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News