కర్నూలులోనే టాప్… ఆ తర్వాత నెల్లూరు.. ఏపీలో అంటుకుంటోంది

ఆంధ్రప్రదేశ్ కు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నట్లు కన్పిస్తుంది. కొత్తగా పధ్నాలుగు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసులు 266కు చేరుకున్నాయి. [more]

Update: 2020-04-06 05:49 GMT

ఆంధ్రప్రదేశ్ కు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నట్లు కన్పిస్తుంది. కొత్తగా పధ్నాలుగు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసులు 266కు చేరుకున్నాయి. విశాఖపట్నంలో ఐదు, అనంతపురం జిల్లాలో మూడు , కర్నూలు జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో రెండు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసునమోదయ్యాయి. ప్రస్తుతం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 56 కేసులు నమోదయ్యాయి. తర్వాత నెల్లూరులో 34 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఐదుగురు కరోనా పాజిటివ్ పేషెంట్లకు నెగిటివ్ రిజల్ట్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. మచిలీపట్నంలో ఒకరు కరోనా కారణంగా మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఏపీలో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.

Tags:    

Similar News