తెలంగాణలో తగ్గని కరోనా కేసులు.. ఈరోజు కూడా భారీగానే

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

Update: 2021-03-22 04:10 GMT

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,455 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,671 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 2,958 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,98,826 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News