ఇది నిజమేనా? తప్పుడు నివేదికలా?

ప్రజలందరికీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది.. ఈ నేపథ్యంలో చిన్నచిన్న లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.. ప్రైవేట్ ల్యాబ్ కు అనుమతించడంతో ఇప్పుడు అందరూ క్యూలు [more]

Update: 2020-07-04 02:46 GMT

ప్రజలందరికీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది.. ఈ నేపథ్యంలో చిన్నచిన్న లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.. ప్రైవేట్ ల్యాబ్ కు అనుమతించడంతో ఇప్పుడు అందరూ క్యూలు కడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రైవేటు సంస్థల్లో కరోనా పరీక్షలు కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో చాలామంది కూడా పరీక్షలు చేయించుకునేందుకు క్యూలు కడుతున్నారు. అయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ చేసిన పరిశోధనలో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా పై ప్రతి రోజు ప్రత్యేక బడ్జెట్ అన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఇవాళ పొందుపరిచిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది.

71 శాతం మందికి….

ఒక ప్రైవేట్ లాబ్ లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజులో 3725 మందికి దగ్గర నుంచి శాంపిల్ ను సేకరించారు . ఇందులో 2672 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేస్తూ ప్రైవేట్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను చూసి అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఎందుకంటే దాదాపు 71 శాతం మందికి కరోనా ఉన్నట్టుగా ఇచ్చిన పరీక్షలో తేటతెల్లమైంది. ప్రైవేట్ లాబ్ నివేదికపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక వచ్చేవరకు కూడా లాబ్ రిపోర్ట్స్ తాత్కాలికంగా ఆపేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ఒకే రోజు 71 శాతం మంది పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని చెప్తుంది. ఏదిఏమైనప్పటికీ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతనే దీనిపైన తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది.

Tags:    

Similar News