బ్రేకింగ్ : ప్రపంచంలో నాలుగో స్థానంలో.. పెరుగుతున్న కేసులు

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్ లో మే నెలలో కరోనా కేసులు 292 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా [more]

Update: 2020-05-26 03:47 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్ లో మే నెలలో కరోనా కేసులు 292 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 1,45. 348 కేసులు నమోదయ్యాయి. 4,167 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆగడం లేదు. అమెరికా, రష్యా, బ్రెజిల్ తర్వాత భారత్ లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే డెత్ రేటు 2.87 శాతం మాత్రమే ఉండటం కొంత ఊరట కల్గించే అంశం. అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రోజుకు భారత్ లో 7 వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. 24 గంటల్లో భారత్ లో 6,535 కేసులు నమోదయ్యాయి. 6,535 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 146 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News