తెలంగాణలో పెరుగుతున్న కేసులు… రానున్న రోజుల్లో?

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 1,924 కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-07-09 02:48 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 1,924 కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,536కు చేరుకుంది. కొత్త గా నమోదయిన కేసుల్లో 1,590 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. హైదరాబాద్ లో ఇప్పటికే ఇరవై ఐదు వేల కేసులు దాటాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 324 మంది మరణించారు. తెలంగాణలో యాక్టివ్ కేసులు 11,933 ఉన్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకూ 17,729 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News