ఆ నాలుగుజిల్లాలపైనే స్పెషల్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నాలుగు జిల్లాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో [more]

Update: 2020-04-23 01:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నాలుగు జిల్లాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం కర్నూలు జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించింది. కరోనా కట్టడి కి కర్నూలులో ఏమేం చేయాలో సూచించాలని వారిని కోరింది. క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని కోరింది. నెల్లూరు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య ఆగడం లేదు. ఇప్పటి వరకూ ఏపీలో 813 మందికి కరోనా వైరస్ సోకింది. 24 మంది కరోనా కారణంగా మృతి చెందారు. యాక్టివ్ కేసులు 669 ఉన్నట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

Tags:    

Similar News