ఏపీలో పెరుగుతున్న కేసులు… అంతా వారివల్లనేనట

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆగడం లేదు. తాజాగా 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల [more]

Update: 2020-06-05 08:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆగడం లేదు. తాజాగా 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీికి వచ్చిన వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీలో ఒక్కరోజులో 50 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చని వారికి 84 మందికి కరోనా వైరస్ సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే అనుమతి ఇస్తుంది. మెడికల్ ఎమెర్జెన్సీకి మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తుంది. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,250కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 73 మంది మరణించారు.

Tags:    

Similar News