కామెడీకి ఎక్కువ... సీరియస్ యాక్టర్ కు తక్కువ

Update: 2018-08-09 09:33 GMT

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకేష్ లాంటి పప్పూ మాటలు కూడా వినాల్సి వస్తోందని, లోకేష్ కామెడీ యాక్టర్ కు ఎక్కువ... సీరియస్ యాక్టర్ కు తక్కువ అని ఎద్దేవా చేశారు. తన తండ్రి చంద్రబాబుకు ధైర్యంగా ప్రత్యర్థులను ఎదుర్కొవడం చేతకాదని, జీవితాంతం వెన్నుపోట్లు పొడవడమే తెలుసని విమర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేదిస్తున్నారని, మరికొన్ని రోజుల్లో జగన్ అధికారంలోకి రానున్నారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీ, చక్ర వడ్డీతో కలిపి గుణపాఠం చెప్తామని పేర్కొన్నారు.

Similar News