సీఎం రమేష్ వందకోట్లను దారి మళ్లించారు....!

Update: 2018-10-19 06:58 GMT

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై మరోసారి బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. వంద కోట్ల రూపాయలను సీఎం రమేష్ పక్కదోవ పట్టించారని ఆరోపించారు. సీఎం రమేష్ కు రాజ్యసభ సభ్యుడికి ఉండాల్సిన కనీస అర్హత లేవన్నారు. సీఎం రమేష్ పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సీఎం రమేష్ తన కంపెనీల్లో దొంగ లెక్కలు చూపించారని జీవీఎల్ ఆరోపించారు. సీఎం రమేష్ ను వెంటనే రాజ్యసభ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఐటీ కంపెనీలకు.....

అలాగే లోకేష్ నిర్వహిస్తున్న ఐటీ శాఖలో చాలా అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కంపెనీలకు కోట్లాది రూపాయల భూములను కట్టబెట్టి ఉద్యోగాలను మాత్రం సృష్టించలేదన్నారు. కేవలం కంపెనీలు మూడు సంవత్సరాల తర్వాత ఆ భూమిని అమ్ముకునేలా నిబంధనలను రూపొందించారన్నారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇప్పటి వరకూ వచ్చాయో? ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాయో? పూర్తి వివరాలను 48 గంటల్లోగా బయటపెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెరలేపారన్నారు. తుపాను సహాయక చర్యలు మానేసి రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

Similar News