చింతమనేని హాట్ కామెంట్స్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజధాని తరలింపుపై హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని తరలింపు ఒక తుగ్లక్ చర్యగా చింతమనేని అభివర్ణించారు. ముఖ్యమంత్రి జగన్ ది [more]

Update: 2020-01-07 06:10 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజధాని తరలింపుపై హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని తరలింపు ఒక తుగ్లక్ చర్యగా చింతమనేని అభివర్ణించారు. ముఖ్యమంత్రి జగన్ ది అంతా రివర్స్ పాలన అని అన్నారు. గద్దె రామ్మోహన్ రావు రాజధాని అమరావతి తరలింపునకు నిరసనగా ఒక రోజు దీక్షకు మద్దతు తెలిపిన చింతమనేని జగన్ తన ఇంటిపేరును కూడా రివర్స్ చేయాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లోనే రాజధాని తరలింపుపై నిరసన వ్యక్తమవుతుందన్నారు. జగన్ అంత అహంకారి, దుర్గార్గుడు మరెవ్వరూ లేరని చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని తరలిస్తే జగన్ తనంతట తాను నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుందని చింతమనేని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News