చెలరేగిపోతున్న చెడ్డీ గ్యాంగ్

Update: 2018-06-15 01:45 GMT

హైదరాబాద్ శివార్లలో మరోసారి చెడ్డిగ్యాంగ్ రెచ్చిపోతోంది. చీకటిపడిదంటే చాలు దోపీడే చేసేందుకు సిద్దమౌతోంది. నిత్యం పహారా ఉన్న అపార్ట్ మెంట్లను సైతం వదలకుండా దోచుకోవాలని చూస్తోంది. చెడ్డి గ్యాంగ్ ఆగడాలతో విసుగెత్తిపోయిన రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎలాగైనా వారి ఆటకట్టించేందుకు రెడీ అయ్యారు.చెడ్డి గ్యాంగ్.. దీని పేరు వింటే చాలు జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటే.. పోలీసులకు కంటిమీద కునుకు కరువవుతోంది. శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకొని ఈగ్యాంగ్ తమ పంజా విసురోతోంది. కాలనీలు, బస్తీలే కాదు.. సెక్యూరిటీ సిసి కెమేరాల పహారా ఉన్నా ఏ మాత్రం భయపడకుండా అపార్ట్ మెంట్లను టార్గెట్ చేస్తోంది. సైబరాబాద్.. రాచకొండ కమిషనరేట్ పరుధుల్లో ఈ గ్యాంగ్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో వరుసగా వీరు దోపిడీలు చేసేందుకు చేసే ప్రయత్నాలు.. సిసి కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ దృశ్యాలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో మాదాపూర్, కొండాపూర్, చందనాగర్, ఆర్సీపురం తోపాటు తాజాగా సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలోని శ్రీనిలయం అపార్టుమెంట్ లో ఈ గ్యాంగ్ హల్ చల్ చేసింది.

ప్రత్యేక బృందాలు......

చీకటిపడిదంటే చాలు ఈ గ్యాంగ్ ఎవరిని టార్గెట్ చేస్తాయో.. ఏ ఇంటిని దోచుకుంటాయో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరుసగా చెడ్డీ గ్యాంగ్ పై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో రెండు కమిషనరేట్ల పోలీసులు విసుగెత్తిపోయారు. చెడ్డీ గ్యాంగ్ భయం జనాల్లో పోవాలి అంటే ఎన్ కౌంటర్ చేసైనా సరే వారి ఆగడాలకు చెక్ పెట్టాలని పోలీస్ బాస్ లు సంకల్పిస్తున్నారు. అందు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి వారి కోసం గాలింపులు ముమ్మరంచేశారు.గతంలో హైదరాబాద్ ని పట్టిపీడించిన చైన్ స్నాచింగ్స్ ముఠాలను అరికట్టడానికి అప్పటి సైబరాబాద్ కమిషనర్ సి.వి ఆనంద్ యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆయుధాలు సైతం అందించారు. వనస్థలిపురంలో ఓ స్నాచింగ్ ముఠాపై కాల్పులు జరపడంతో అప్పటి నుండి సిటీలో స్నాచింగ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలోనే చెడ్డీ గ్యాంగ్ ని సైతం అరికట్టాలంటే ఎన్ కౌంటరే బెటర్ జనం పోలీసులను వేడుకుంటున్నారు

Similar News