ఏయ్...ఎవర్నువ్వు...అని బాబు సీరియస్

Update: 2018-06-18 13:01 GMT

తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేసిన నాయి బ్రాహ్మణులపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సోమవారం ప్రభుత్వంలో చర్చలు జరిపేందుకు నాయి బ్రాహ్మణ నాయకులు సచివాలయానికి వచ్చారు. మంత్రులతో చర్చలు విఫలమై బయటకు రాగా, అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రిని అడ్డుకున్నారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు నాయుడు ఒక దశలో సహనం కోల్పోయారు. ‘మీరేం చేస్తారో చేయండి..ఎవరిని బెదిరిస్తారు..? ఏ ఊరు నీది..? తొమ్మిదేళ్లు పరిపాలించా..ఒక్కడు రోడ్డుమీదకు రాలేదు.. న్యాయం ఉంటే నేనే వెతుక్కుంటూ వస్తా...బెదిరించాలనుకుంటే తోక కట్ చేస్తా...మిమ్మల్ని ఇంతమందిని లోపలికి రానిచ్చిందే ఎక్కువ..నచ్చితే చేయండి..లేకపోతే వెళ్లండి..’ అని హెచ్చరించారు. ఒక్కో కేశఖండనకు రూ.25 ఇస్తామని, సంతోషంగా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వోద్యోగులుగా గుర్తించడం కుదరదని తేల్చిచెప్పారు.

Similar News