చంద్రబాబు మళ్లీ…?

తెలుగుదేశం పార్టీ అధినేత మళ్లీ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 14వ తేదీన ఇసుక కొరత కు నిరసనగా ఒకరోజు దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆరోజు [more]

Update: 2019-11-05 07:31 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత మళ్లీ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 14వ తేదీన ఇసుక కొరత కు నిరసనగా ఒకరోజు దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆరోజు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో అందరూ టీడీపీ నేతలు పాల్గొననున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ధర్మపోరాట దీక్షలు చేశారు. చివరకు తన పుట్టినరోజున కూడా దీక్షకు దిగి సంచలనం సృష్టించారు. ఇటీవల ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలపై వేధింపులకు నిరసనగా తనను హౌస్ అరెస్ట్ చేస్తే ఇంట్లోనే చంద్రబాబు దీక్షకు దిగారు. మరోసారి ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షకు దిగనున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు.

Tags:    

Similar News