ప్రభుత్వం పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించడం లేదు

కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపితే ప్రమాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణ చర్యల కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. [more]

Update: 2020-04-21 08:04 GMT

కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపితే ప్రమాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణ చర్యల కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. వైద్యులకు కూడా కరోనా సోకుతుందంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వైద్యులు మృతి చెందడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. తొలి వారం ప్రభుత్వం చాలా తప్పులు చేసిందన్నారు. ఫీల్డ్ లో ఉండి పనిచేసేవారికి రక్షణ కల్పించాలన్నారు. సూచనలు ఇచ్చే వారిపై విమర్శలు చేయడం తగదన్నారు. ర్యాపిడ్ టెస్ట్ కొనుగోళ్లలోనూ ప్రభుత్వం పట్టు బడిన తర్వాత మాట మార్చిందన్నారు. ఇది వైసీపీ సొంత విషయం కాదని, ఐదు కోట్ల మంది ప్రాణాలకు సంబంధించిన విషయమన్నారు. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నిస్తే ఆయన పై విరుచుకుపడ్డారన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు.

Tags:    

Similar News