జగన్ కు బాబు రెండు ఆప్షన్లు

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందు రెండు ఆప్షన్లు పెట్టారు. నిజంగా ఐదు కోట్ల మంది ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటుంటే అసెంబ్లీని రద్దు [more]

Update: 2020-01-27 14:47 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందు రెండు ఆప్షన్లు పెట్టారు. నిజంగా ఐదు కోట్ల మంది ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటుంటే అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికలకు వెళ్లి మళ్లీ గెలిస్తే రాజధానిని అమరావతి నుంచి తరలించవచ్చని చెప్పారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసే ధైర్యం లేకుంటే అమరావతిపై రాష్ట్ర వ్యాప్తంగా రిఫరెండం పెట్టాలని కోరారు. రిఫరెండం ప్రకారం తాను నడుచుకుంటానని చంద్రబాబు చెప్పారు. తాను ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచానని పదే పదే విమర్శిస్తున్నారని, కానీ తాను ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికే ఆ పని చేశారన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయం మేరకే నాడు నడుచుకున్నామన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలతోనే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ వెళుతుందని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News