ఆపేదే లేదు

అమరావతి జేఏసీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. తాను జేఏసీ ఆహ్వానం మేరకే హాజరయ్యానని చంద్రబాబు తెలిపారు. సెక్యూరిటీ సమస్య పేరుతో జేఏసీ బస్సులను అనుమతించడం లేదని పోలీసులు [more]

Update: 2020-01-09 07:55 GMT

అమరావతి జేఏసీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. తాను జేఏసీ ఆహ్వానం మేరకే హాజరయ్యానని చంద్రబాబు తెలిపారు. సెక్యూరిటీ సమస్య పేరుతో జేఏసీ బస్సులను అనుమతించడం లేదని పోలీసులు చెబుతున్నారని, తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లు పాదయాత్ర చేసినప్పుడు అడ్డుకున్నానా? అని ప్రశ్నించారు. తాను అడ్డుకోక పోవడం వల్లనే ముద్దులు పెట్టుకుంటూ తిరిగారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ అంత పిరికివాడు ఎవరూ లేరన్నారు.

కొనసాగుతుంది….

ఎట్టిపరిస్థితుల్లో బస్సు యాత్రను ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. జేఏసీలు పెట్టుకోకూడదా? ఇదేం ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. దాదాపు 11 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా జగన్ కు పట్టదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగించడానికి ఇంతకు మించి ఏం కావాలన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని, అంతే తప్ప రాజధానిని అమరావతి నుంచి తరలించ వద్దని కోరారు. అమరావతి ఇక్కడే ఉంటుందని ప్రకటన వచ్చేంతవరకూ ఉద్యమం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. లాయర్ల జేఏసీ సయితం యాక్టివ్ కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News