జగన్ పిరికోడు

జగన్ భయపడితే భయపెడతాడని, గట్టిగా ఎదురుతిరిగితే పులివెందుల పారిపోతాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పులివెందుల పారిపోయాలా? జై అమరావతి అంటూ నినదించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. [more]

Update: 2020-01-01 07:20 GMT

జగన్ భయపడితే భయపెడతాడని, గట్టిగా ఎదురుతిరిగితే పులివెందుల పారిపోతాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పులివెందుల పారిపోయాలా? జై అమరావతి అంటూ నినదించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. పవన్ కల్యాణ్ ను రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించకుండా ఎందుకు అడ్డుకున్నారన్నారు. తాను నిజంగా ఆరోజు అడ్డుకుంటే జగన్ పాదయాత్ర చేసి ఉండేవాడా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జగన్ బయట తిరగలేని పరిస్థితి ఉందన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసి ఏపీ ప్రజలు నెత్తి మీద కుంపటి పెట్టుకున్నారని చెప్పారు. తన మీద కక్ష తోనే రాజధాని మార్చాలని చూస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారన్నారు.

Tags:    

Similar News