పనివాళ్లను కూడా రానివ్వడంలేదు

తన ఇంట్లోకి పనివాళ్లను కూడా రానివ్వడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తాను పవిత్ర ఉద్దేశ్యంతో ఆందోళనకు దిగితే [more]

Update: 2019-09-11 06:00 GMT

తన ఇంట్లోకి పనివాళ్లను కూడా రానివ్వడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తాను పవిత్ర ఉద్దేశ్యంతో ఆందోళనకు దిగితే జగన్ అరాచకాలకు దిగుతున్నారన్నారు. తమ నేతలందరినీ అరెస్ట్ చేశారన్నారు. ఎస్సీ, బీసీలని చూడకుండా నేతలను అవమానించారన్నారు. చలో ఆత్మకూరు కొనసాగుతుందని చెప్పారు. తనను ఇంట్లో నిర్భంధించడం సరికాదన్నారు. జగన్ క్యారెక్టర్ ఏంటో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. అయితే చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరడానికి రెడీ అవుతుండటంతో ఆయన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్ బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్దయెత్తున చంద్రబాబు నివాసం వద్ద మొహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News