బెదిరింపులు వద్దు

పీపీఏల సమీక్ష పేరుతో కంపెనీలకు బెదిరింపులు వద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన వ్యూహకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీపీఏలను సమీక్షించితే కంపెనీలు వెనకడుగు వేసే [more]

Update: 2019-07-18 03:41 GMT

పీపీఏల సమీక్ష పేరుతో కంపెనీలకు బెదిరింపులు వద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన వ్యూహకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీపీఏలను సమీక్షించితే కంపెనీలు వెనకడుగు వేసే అవకాశముందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే విద్యుత్తు 2.30 రూపాయలకు వస్తుందన్నారు. వినియోగదారులపై భారం పడటం లేదన్నారు. అలాగే తమ ప్రభుత్వం రైతాంగంలో విశ్వాసాన్ని కల్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని చంద్రబాబు కోరారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ఆయన కోరారు. బెదిరింపులకు దిగితే నష్టపోయేది వైసీపీయేనని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News