వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే… 38 శాతం ఓట్లు వచ్చాయ్

పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది వైసీపీకి తన హెచ్చరిక అని చంద్రబాబు తెలిపారు. ఇరవై నెలలుగా జగన్ ప్రభుత్వం [more]

Update: 2021-02-10 08:07 GMT

పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది వైసీపీకి తన హెచ్చరిక అని చంద్రబాబు తెలిపారు. ఇరవై నెలలుగా జగన్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థపై దాడులకు పాల్పడిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి న్యాయవ్యవస్థ వరకూ ఎవరినీ జగన్ వదలిపెట్టలేదన్నారు. తాను ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారన్నారు. రాజధాని అమరావతిని శ్మశానంగా మార్చారన్నారు. అన్ని వర్గాలపై దాడులు జరుగతున్నాయని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. 90 శాతం పంచాయతీలను గెలిస్తేనే మంత్రిపదవులు ఉంటాయని జగన్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. కిడ్నాప్, హత్యలు జరిగినా ప్రజలు ధైర్యంగా నిలబడ్డారన్నారు. నిజమైన హీరోలు ప్రజలేనన్నారు. వారికి నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీయే నని చెప్పారు. పంచాయతీ ఎన్నికలలో 38 శాతం ఓట్లు టీడీపీకి వచ్చాయన్నారు. దీంతోనైనా బుద్ధి తెచ్చుకోవాలని చంద్రబాబు తెలిపారు. 94 శాతం గెలిచామని ఫేక్ మంత్రులు చెబుతున్నారన్నారు.

జగనన్న వదిలిన బాణమే…..

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యమని చంద్రబాబు తెలిపారు. విజయసాయిరెడ్డి గెలుపు ఓటములు సహజమని చేసిన ట్వీట్ ను ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. జగనన్న వదిల బాణం షర్మిల పార్టీ పెడుతున్నట్లు చెబుతున్నా విజయసాయిరెడ్డి అబద్ధాలు చెప్పడంలో, నేరాలు చేయడంలో దిట్ట అని అన్నారు. జగన్ సాక్షాత్తూ బాబాయిని చంపి కేసును తారుమారు చేస్తున్న వ్యక్తి అని అన్నారు. ప్రతిరోజూ ఢిల్లీ వెళ్లి కేసు నుంచి కాపాడమని కోరుకుంటున్నారు. అచ్చెన్నాయుడును కక్ష కట్టి అరెస్ట్ చేశారన్నారు.

ఎవరినీ వదిలిపెట్టం…..

రానున్న రోజుల్లో తప్పు చేసిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని చోట్ల అరాచకాలకు పాల్పడి వైసీపీ గెలిచుకుందన్నారు. కొన్ని చోట్ల టీడీపీ గెలిచినా వైసీపీ విజయం సాధించినట్లు ప్రకటించారన్నారు. వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. వందల పంచాయతీల్లో టీడీపీ గెలిస్తే తాము గెలుచుకున్నట్లు వైసీపీ ప్రకటించుకున్నారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై కోర్టుకు వెళతామని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. పిరికితనంతో ప్రజలను ఓట్లేయ్యకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారన్నారు. రెండు, మూడు, నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో ధైర్యంగా నిలబడాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News