జగన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు

ప్రభుత్వం కరోనా వైరస్ ను సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే ఒక్కసారిగా 17 కేసులు నమోదయ్యాయన్నారు. తక్కువ పరీక్షలు చేస్తే భవిష్యత్తులో [more]

Update: 2020-03-31 12:14 GMT

ప్రభుత్వం కరోనా వైరస్ ను సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే ఒక్కసారిగా 17 కేసులు నమోదయ్యాయన్నారు. తక్కువ పరీక్షలు చేస్తే భవిష్యత్తులో ఎక్కువ సమస్యలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. లోకల్ ట్రాన్స్ మిషన్ ను కంట్రోల్ చేయలేకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కరోనా కంటే ఫాస్ట్ గా పనిచేస్తే తప్ప దీనిని అరికట్టలేమని చంద్రాబాబు తెలిపారు. తాను ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశానని చెప్పారు. తాను రాజకీయాలు చేయడం లేదని, సూచనలు మాత్రమే చేస్తున్నానని తెలిపారు. వాలంటీర్ల ద్వారానే ప్రజలకు రేషన్ అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు అందించాలన్నారు. వాస్తవాలు బయటకు రావడం లేదన్నారు. చైనాలో 62 రోజుల పాటు లాక్ డౌన్ పాటించారన్నారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ భౌతిక దూరం పాటించాల్సిందేనని చంద్రబాబు తెలిపారు. అనుకోని ప్రమాదం వస్తే ఎలా కంట్రోల్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News