అచ్చెన్న ది అరెస్ట్ కాదు.. కిడ్నాప్

అచ్చెన్నాయుడును కిడ్నాప్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబు స్పందించారు. అచ్చెన్నాయుడు కిడ్నాప్ కు జగన్ బాధ్యత వహించాలని చంద్రబాబు కోరారు. [more]

Update: 2020-06-12 03:29 GMT

అచ్చెన్నాయుడును కిడ్నాప్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబు స్పందించారు. అచ్చెన్నాయుడు కిడ్నాప్ కు జగన్ బాధ్యత వహించాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారనే అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతున్న సమయంలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు కిడ్నాప్ కు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలన్నారు చంద్రబాబు. అచ్చెన్నాయుడు ఆచూకీ విషయం డీజీపీ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News