బ్రేకింగ్ : జగన్ పారిపోయారు… కేంద్ర జోక్యం చేసుకోవాలి

తన సవాల్ ను స్వీకరించలేక వైసీపీ సైలెంట్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానిని మార్చే అధికారం వీళ్లకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలను అడగకుండా [more]

Update: 2020-08-05 12:10 GMT

తన సవాల్ ను స్వీకరించలేక వైసీపీ సైలెంట్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానిని మార్చే అధికారం వీళ్లకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలను అడగకుండా రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ కు కనువిప్పు కలగానే తాను వారు మాట్లాడిన మాటలను ఐదు కోట్ల మంది ప్రజలకు చూపించానని చంద్రబాబు చెప్పారు. ప్రజలను నమ్మించి ద్రోహ‍ం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. భావితరాల భవిష్యత్ ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం పై ప్రజలకు విశ్వసనీయత లేదన్నారు. తన సవాల్ ను స్వీకరించలేక జగన్ పారిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. తిరగబడి నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నారు. ఇది వ్యక్తిగతంగా తనకు సంబంధించింది కాదన్నారు. తన కుటుంబానికి, పార్టీకి కూడా నష్టం లేదన్నారు. భావి తరాలే నష్టపోతారన్నారు.

రెండురోజుల కొకసారి ప్రెస్ మీట్….

రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కారన్నారు. రైతులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిపై జోక్యం చేసుకోవాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఏపీలో ఎక్కువగా ఉంటే మూడు రాజధానుల అంశం ఇప్పుడు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయం రైతుల వైపు ఉంది కాబట్టే కోర్టులో ఈ బిల్లులపై స్టే వచ్చిందన్నారు. అసత్యాలు చెప్ప ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. ఈ ముఖ్యమంత్రికి ఆయనపైనే నమ్మకం లేదన్నారు. పీపీఏల విషయంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. నా సవాల్ కు పిరికి పందల్లాగా పారిపోయారన్నారు. ఇక రెండురోజుల కొకసారి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. ప్రశాంతమైన నగరం విశాఖను జగన్ దెబ్బతీస్తున్నారన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో వీరివల్ల అని ఆవేదన చెందారు.

Tags:    

Similar News