జగన్ పేరు గూగుల్ లో కొడితే?

జగన్ పేరు గూగుల్ కొడితే ఖైదీ నెంబరు 6093 అని వస్తుందని, ఈయన మనకు ముఖ్యమంత్రా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఖైదీ నెంబరు 6093 అని గూగుల్ [more]

Update: 2020-01-01 06:44 GMT

జగన్ పేరు గూగుల్ కొడితే ఖైదీ నెంబరు 6093 అని వస్తుందని, ఈయన మనకు ముఖ్యమంత్రా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఖైదీ నెంబరు 6093 అని గూగుల్ లో సెర్చ్ చేస్తే మన ముఖ్యమంత్రి జగన్ పేరు వస్తుందని తెలిపారు. ఇలాంటి నేరగాళ్లు మన ముఖ్యమంత్రి అని సెటైర్ వేశారు చంద్రబాబు. జీఎన్ రావు ఒక పనికిమాలిన అధికారి అనిఅన్నారు. ఆయన గుంటూరు కలెక్టర్ గా ఉండి అమరావతి మునిగిపోతుందని రిపోర్ట్ ఇచ్చారు. అలాంటి జీఎన్ రావుతో కమిటీ వేస్తారా? అని ప్రశ్నించారు. బోస్టన్ గ్రూపు కన్సెల్టెన్సీ గ్రూపు పై పోర్చుగుల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ విచారణ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. బోస్టన్ గ్రూపు కన్సల్టెన్సీ ఇచ్చే నివేదిక అర్థం లేదన్నారు. బోస్టన్ గ్రూపు లో విజయసాయిరెడ్డి అల్లుడు ఫ్రెండ్ ఎండీగా పనిచేస్తున్నారన్నారు. హెటిరో గ్రూపు కూడా వారిదేనన్నారు. విశాఖలో వేలాది ఎకరాల భూములను కొనుగోలు చేశారన్నారు. పేరుతో కాలయాపన చేస్తూ ఐదు కోట్ల మంది ప్రజలను అయోమయంలో పడశారన్నారు చంద్రబాబు.

Similar News