విర్రవీగవద్దు…భవిష్యత్తును ఫణంగా పెట్టొద్దు

అధికారం వచ్చిందని విర్రవీగడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఐదు కోట్ల మంతి ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం సరికాదన్నారు. దీనిపై చర్చ [more]

Update: 2019-07-11 04:54 GMT

అధికారం వచ్చిందని విర్రవీగడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఐదు కోట్ల మంతి ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం సరికాదన్నారు. దీనిపై చర్చ జరగాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా భావితరాల భవిష్యత్తును పణంగా జగన్ పెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు జగన్, కేసీఆర్ కలుస్తున్నారు కాబట్టి సమస్యలు రాకపోవచ్చని, భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తన రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు అని చంద్రబాబు అన్నారు. అనుభవరాహిత్యం కారణంగా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని విమర్శించారు. దీనికి జగన్ స్పందిస్తూ చంద్రబాబు రాజకీయాలు ఎందుకూ పనికి రావన్నారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏమీ చేయలేకపోయారన్నారు. బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేశారన్నారు. కేసీఆర్ ను తిడితే ప్రయోజనమేంటని ప్రశ్నించారు.

Tags:    

Similar News