ఐటీ దాడులకు నిరసనగా చంద్రబాబు ధర్నా

నరేంద్ర మోడీ కక్షగట్టి ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన [more]

Update: 2019-04-05 07:32 GMT

నరేంద్ర మోడీ కక్షగట్టి ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ హైదరాబాద్ లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు. అందుకే టీడీపీ నేతలపై కక్షకట్టి ఎన్నికల సమయంలో ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు మనోధైర్యం కోల్పోయేలా వైసీపీతో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దీనిని ఖండిస్తూ తాను నిరసన తెలియజేస్తున్నానని, అందరూ తమకు సంఘీభావం తెలిపాలని, రాష్ట్రమంతా అట్టుడికే పరిస్థితి రావాలని, బీజేపీ, జగన్, టీఆర్ఎస్ ను గంగలో కలపాలన్నారు. నరేంద్ర మోడీ తమాషాలు ఆడొద్దని, ఇష్టానుసారం చేయవద్దని హెచ్చరించారు. తమిళనాడు దినకరణ్ పై ఐటీ దాడులు జరిగితే దినకరణ్ కు మెజారిటీ వచ్చిందన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ పై ఐటీ దాడులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సన్నిహితులపై దాడులు చేస్తే కేజ్రీవాల్ కు మరింత మెజారిటీ పెరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్ లోనూ మాయావతి, అఖిలేష్ యాదవ్ పై ఇలానే దాడులు చేస్తే గోరఖ్ పూర్ లో బీజేపీ ఘోరంగా ఓడిందని గుర్తు చేశారు.

అధికారులనూ వదిలిపెట్టను…

తమపై ఒత్తిడి చేసి రాజకీయలబ్ధి పొందాలని నరేంద్ర మోడీ, జగన్ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తిగా, చరిత్రహీనుడిగా నరేంద్ర మోడీని నిలబెడతామని స్పష్టం చేశారు. తనను ఏమీ చేయలేరని, మహా అయితే ప్రాణాలు తీయగలరని పేర్కొన్నారు. కొట్లాడి రాష్ట్ర హక్కులు, ప్రత్యేక హోదా సాధిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం మళ్లీ రాదని, అధికారులు తప్పులు చేస్తే వదిలిపెట్టమని, ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఏకపక్షంగా, ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోనని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గుడిని క్షమించవద్దని, అందరూ ఎదురుతిరిగి గుణపాఠం చెప్పాలని అన్నారు.

Tags:    

Similar News