బాబుకు కోపమొచ్చింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపమొచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కరవుపై చర్చ సందర్భంగా తాము కొత్తగా రైతులకు సున్నా వడ్డీ పథకానికి రుణాలిచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. [more]

Update: 2019-07-11 09:26 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపమొచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కరవుపై చర్చ సందర్భంగా తాము కొత్తగా రైతులకు సున్నా వడ్డీ పథకానికి రుణాలిచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఇది ఎప్పటి నుంచో ఉన్న పథకమని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే ఈ పథకం ప్రారంభమయిందని, ఇప్పటీకీ కొనసాగుతుందని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్ విసిరారు. 2014 నుంచి రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ఇవ్వనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన వయసుకు కూడా గౌరవం ఇవ్వడం లేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనేది లేదని హెచ్చరించారు.అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Tags:    

Similar News